Headlines

‘మా జట్టు ని తిడితే మా ఫ్యామిలీని తిట్టినట్లే’.. ‘అయితే మీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకో’

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat kohli), మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ( Goutham Gambhir)మధ్య రేగిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది .

మొన్నటి లక్నో -ఆర్సిబీ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పనిష్మెంట్ కింద వీరిద్దరికి మ్యాచ్ ఫీజులో 100% కోత కూడా పడింది. అసలు స్టేడియంలో ఏం జరిగిందన్న దానిపై ఎవరికి వారు తెలిసింది, ఊహించింది చెప్తున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసిన వారి వాదన మరోలా ఉంది. వారు చెప్పిన దాని ప్రకారం.. గ్రౌండ్ లో ఏం జరిగిందంటే..

‘మా టీం మేట్స్ పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నావ్’ అని విరాట్ ని లక్నో జట్టు ఆటగాడు కైలి మేయర్స్ అడుగుతుండగా.. మధ్యలో గంభీర్ వచ్చి విరాట్ తో మాట్లాడద్దు అన్నట్లు మేయర్స్ ని వారించడంతో వివాదం చెలరేగింది. దీంతో విరాట్ కూడా ఏదో అన్నట్లు అనిపించడంతో గంభీర్ అతడి పై సీరియస్ అయ్యాడు. ‘నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మీరు మధ్యలో ఎందుకు వచ్చారు?’అని గంభీర్ ని కోహ్లీ ప్రశ్నించాడు. దీనికి గంభీర్ స్పందిస్తూ ‘మా ఆటగాళ్లను తిడితే మా ఫ్యామిలీని తిట్టినట్టే’ అని బదులిచ్చాడు. ‘ అయితే నీ ఫ్యామిలీ ని కంట్రోల్ లో పెట్టుకో’ అని కోహ్లీ అన్నాడు. ‘ ఇప్పుడు ఇవన్నీ నీ దగ్గర నేర్చుకోమంటావా? అని గంభీర్ ప్రశ్నించాడు. మధ్యలో ఇద్దరినీ కంట్రోల్ చేయడానికి లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఈలోపు ఇతర జట్టు సభ్యులు వచ్చి వారిద్దరిని విడదీయడంతో గొడవ సర్దుమనిగింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.