బెంగళూర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరో విజయాన్ని తన ఖాతాలో…

బెంగళూర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆర్ ఆర్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఆఖరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన ఆర్ ఆర్ ఆ ఓవర్ లో 12 చేసి విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది.. మందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 189 పరుగులు చేసింది.. ఆ తర్వాత 20ఓవర్లలో ఆర్ ఆర్ ఆరు వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ 12, హెట్మెయిర్ 3, సంజూ కేవలం 22 పరుగులు , జైశ్వాల్ 47, పడిక్కల్ పడిక్కల్ 52 , జోస్ బట్లర్ సున్నా పరుగులకు ఔటయ్యారు.

సిరాజ్ , విల్లీలకు ఒక్కో వికెట్ లభించగా, సిరాజ్ కు మూడు వికెట్లు దక్కాయి.. అంతకు ముందు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకం బాదారు. దాంతో, నిర్ధారిత 20 ఓవర్ లలో ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్‌రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది