Headlines

రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యం రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటాం

 

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,

డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి

ఈరోజు ఉమ్మడి కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, మంగోల్, లకుడారం, తిమ్మారెడ్డిపల్లి, వెలికట్ట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు పండించిన చివరి గింజ వరకు కొనాలని మాకు ఆదేశించారని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఏవి కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు అని కానీ
నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాలతో రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం తీసుకురావడం జరిగిందని,
అలాగే రైతు కుటుంబంలో రైతుకు ఏదైనా జరగరానిది జరిగి రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం రైతు బీమా పథకం తెచ్చారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఉన్న రైతులందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ గారు తపన పడుతున్నారని తెలిపారు.

రానున్న కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయస్థాయిలో రైతు శ్రేయస్సు కోసం పోరాటం చేస్తుందని,
దేశంలో ఉన్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి ముందుకు పోతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ సభ్యులు, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, భారత రాష్ట్ర సమితి ఉమ్మడి మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, ఆర్ బి ఎస్ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, ఆర్ బి ఎస్ జిల్లా సభ్యులు దోమల ఎల్లం ,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, సర్పంచ్ లు కుకునూరు పల్లి పోల్కంపల్లి జయంతి నరేందర్, మంగోల్ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి, లకుడారం కనకవ్వ ఐలయ్య, తిమ్మారెడ్డిపల్లి మల్లమారి రవీందర్, వెలికట్ట అమ్ముల రమేష్ బాబు, ఎంపిటిసిలు చింతల సాయిబాబా, భూములు గౌడ్, హరిత సంతోష్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు నరసింహ చారి, బూర్గుల సురేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు సున్నం భాస్కర్, లగిశెట్టి కనకయ్య, పాల శంకర్, మండల కోఆప్షన్ సభ్యులు ఎం.డి.అజిమద్దీన్, మాజీ సర్పంచ్ లు కోలా రవీందర్, బాలబ్రహ్మం, ఎండి హైమద్, స్కైలాబ్, వంగ శ్రీనివాస్, కనక సేన, నర్సింలు గౌడ్, మల్లం ఐలయ్య, కర్ణాకర్, మల్లేశం, రామచంద్రారెడ్డి, చరణ్, ఇళ్ల రాములు, కర్ణాకర్, సంపత్, ఇండ్ల కనకయ్య, గొడుగు యాదగిరి, కోడెల యాదగిరి, కంకణాల మల్లేశం, చంద్రం, కరుణాకర్, శ్రీనివాస్ రెడ్డి తో పాటు తో పాటు నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు…….