బీసీ రిజర్వేషన్లు పెంచాలి. బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్

 

గొల్లపల్లి : బీసీ రిజర్వేషన్ పెంచాలని విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని తెలుపాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలను వివిధ పార్టీలు విస్మరిస్తున్నాయని ఎప్పుడో 40 ఏళ్ల కింద ఇచ్చిన 25% రిజర్వేషన్లు ఇంకా అదే కొనసాగిస్తూ బీసీలను సామాజికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా వెనుకబాటుకు గురి చేశారు. రాష్ట్రంలో వివిధ పార్టీలో బీసీ నాయకులుగా మంత్రులుగా ఉన్న బీసీ నాయకులు కనీసం రిజర్వేషన్ పై మాట్లాడకపోవడం తమ పార్టీపై ఒత్తిడి తేకపోవడం దురదృష్టంకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్,బీసీ నాయకులు సిరికొండ తిరుపతి బీసీ విద్యార్థి సంఘం టౌన్ అధ్యక్షుడు తాడూరు సంజయ్, వెంకటేష్ గౌడ్ ,అభి, ముస్తఫా, సిరికొండ వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.