యాడికి లోమేమున్నామంటున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్..

యాడికి లోమేమున్నామంటున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు నారాయణస్వామి కాలనీలో నివాసముంటున్న నాసా గురుస్వామి అనారోగ్యంతో చనిపోవడంతో పోయడానికి బంధువులు ఎవరు లేకపోవడంతో అతని భార్య లీలావతి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించింది. ఫౌండేషన్ మిగతా సభ్యులకి విషయం తెలియజేసి నాసా గురు స్వామి అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమం అనంతరం లీలావతి అయిన వాళ్లు ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న మాలాంటి వాళ్లకు మీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవ చేస్తున్నందుకు శతకోటి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సెక్రెటరీ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, చింతా నరసింహా,బడిగింజల వేణు,సాయివరపు నాగరాజు, పల్లా ఆంజనేయులు,కావలి సుధాకర్,సాకే శంకరప్ప పాల్గొనడం జరిగింది.