శాసన సభ ఎన్నికలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ ప్రక్రియ పూర్తి చేయడమైనదని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. 

పత్రికా ప్రకటన

తేదీ 20..11.2023

నిర్మల్ జిల్లా సోమవారం

 

శాసన సభ ఎన్నికలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ ప్రక్రియ పూర్తి చేయడమైనదని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

సోమవారం సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ , ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ల సమక్షం లో జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మైక్రో అబ్జర్వర్స్ రాండమైజేషన్ నిర్వహించడం జరిగింది. ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు.

జిల్లాలో మూడు నియోజక వర్గాలు నిర్మల్ -47, ముదోల్ -50, ఖానాపూర్ – 58 నియోజక వర్గాలపరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్స్ ను (యాదృచ్ఛికరణ) ద్వారా మొత్తం 155 మైక్రో అబ్జర్వర్స్ ను కేటాయించడం జరిగిందని, వీరికి త్వరలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆన్నారు.

 

ఈ కార్యక్రమంలో Deo రవీందర్, ఈడీఎం నదీమ్, NIC ఇంజనీర్స్ మణికంఠ, మీర్జా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

 

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ జిల్లా చే జారీ చేయనైనది.