నూనె కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన దుద్దెడ గ్రామ యువకులు..

 

 

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన పలువురు యువకులు పల్లె ప్రవీణ్, పిళ్లి సాయి దీపక్, పిల్లి భరత్, పిల్లి చందు, గడ్డల సాయి, పల్లె కరుణాకర్, కొమ్ము విశాల్, గజ్వేల్ వెంకట్, కౌడయపల్లి శరత్ కుమార్ లు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బారాస మండల అధ్యక్షులు *నూనె కుమార్ యాదవ్* సమక్షంలో దుద్దెడ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు *పల్లె బాబు* ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా బారాసలో చేరిన యువకులతో సమావేశమైన *నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ* కెసిఆర్ గారి నాయకత్వంలో మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగ

అన్న సందర్భాలు ఉన్నాయని,

కానీ నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో *రైతుల కోసం* 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా, కాలేశ్వరం నీళ్లు లాంటి పథకాలు ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సంక్షేమం, సంతోషమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు.

 

పార్టీలో చేరిన దుద్దెడ గ్రామ యువకులకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు, ఎస్టి సెల్ అధ్యక్షులు కెమ్మసారం శ్యామ్, యూత్ నాయకులు రాకేష్ గౌడ్, సంతోష్, శివ, గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు…