జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు.hu

 

 

పుట్టపర్తి, న్యూస్ 9, నవంబర్ 26:

 

 

పుట్టపర్తి ,నవంబర్ 26: జిల్లాలో నేటి నుండి జనవరి 26 వరకు రెండు మాసాల పాటు నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం పుట్టపర్తి మండలం బొంతలపల్లి గ్రామంలో ని ఆర్ డి టి పాఠశాల ప్రాంగణం వద్ద లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి శివకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాల మేరకు పుట్టపర్తి, పెనుగొండ ,కదిరి, ధర్మవరం డివిజన్ స్థాయిలలో కూడా ప్రతిరోజు రెండు పంచాయతీ గ్రామాలు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్డిఏ పిడి మరియు హౌసింగ్ ఇంచార్జ్ పిడి నర్సయ్య అందరి చేత రాజ్యాంగం పీఠికను అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం లభించాయని ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన దేశంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని డిఆర్డిఏ పిడి నరసయ్య పేర్కొన్నారు.

అనంతరం వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపిఓ శివకుమారి మాట్లాడుతూ అర్హులైనప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందని బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అవగాహన కల్పించేందుకు గాను వికసిత్ భారత్ సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన నూతన జిల్లాలో కూడా కార్యక్రమాలు 60 రోజులపాటు జరగనున్నట్లు డిపిఓ శివ కుమారి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతోందన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న 17 రకాల సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని సంబంధిత శాఖ అధికారులను సూచించారు.అలాగే జిల్లాలో నాలుగు డివిజన్ల లో ని ఆయా పంచాయతీ గ్రామ స్థాయిలో ప్రతిరోజు రెండు గ్రామాలు చొప్పున 4 మొబైల్ ప్రచార రథాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా వీడియో చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయా శాఖల ద్వారా అమలు అవుతున్న పథకాలపై సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. మొదట వైద్య రంగానికి డి ఎం హెచ్ ఓ ఎస్. వి. కృష్ణారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలవుతున్న కేంద్ర పథకాలు ఆయుష్మాన్ భారత్ , ప్రధానమంత్రి మాతృత్వ యోజన, ప్రధానం మంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం సంబంధించి ప్రజలకు వివరించారు. బొంతలపల్లి గ్రామానికి సంబంధించి 141 మంది కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారని అలాగే సాధారణ ఆరోగ్య సేవలు ద్వారా 43 మంది వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా బొంతల పల్లి గ్రామానికి చెందిన 220 మంది 15 విడుదలలో ఒక్కొక్కరు రూ. .2000 రూపాయలు చొప్పున సుమారు రూ.66 లక్షల తో లబ్ధి పొందారని వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. అలాగే పంటలకు సంబంధించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, కిసాన్ క్రెడిట్ కార్డ్, నానో ఎరువుల వాడకం, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు ఏ విధంగా పాటించాలన్న అంశాలపై వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా వివరించారు. ఎల్ డి ఎం రమణ కుమార్ మాట్లాడుతూ వివిధ బ్యాంకుల ద్వారా అర్హులైన రైతులకు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి రుణ, సబ్సిడీ సహాయాలు వివరాలను తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, రూపే కార్డు స్వదేశీ కార్డు ద్వారా అదనపు సౌకర్యాలు ప్రమాద భీమా సౌకర్యం తదితర పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారులతో అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అధికారులకు తెలిపారు. బొంతలపల్లి గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వివిధ రీతిలో జీవనోపాధి పొంది తన కుటుంబాన్ని పోషించిన తీరును పరిశీలించి ఆమెను అధికారులు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. అనంతరం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ,దీన్ దయాల్ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్ యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు జనరల్ నాలెడ్జిపై పోటీలు నిర్వహించిన సందర్భంగా విద్యార్థులకు అధికారులు వారిని అభినందించి గ్రామాల్లోని పిల్లలందరూ బాగా చదవాలని, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పథకాల ను అవగాహన చేసుకుని పిల్లలకు ఇప్పటినుంచి మంచి విద్యా బోధనలు నేర్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతి ప్రధానం చేశారు. హరికృష్ణ , కొండమ రాజు వేరూరుగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రైతులందరికీ ఉపయోగ కరమైన పథకాలను అమలు చేస్తున్నారని అర్హత ఉండి మిగిలిపోయిన వారు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని సంకల్పంతో భారత దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవు న్నాయని తీరును పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. అలాగే బొంతలపల్లి గ్రామానికి నెట్వర్క్ సమస్య ఉన్న కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్య వీలైనంత త్వరగా నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు ఎంపీటీసీ కుల్లాయప్ప, స్థానిక నాయకులతో పాటు గ్రామ, వార్డు సచివాలయ నోడల్ అధికారి శివారెడ్డి, మండల నోడల్ ఆఫీసర్.డా.శుభదాస్, ఎంపీడీవో నాగేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వై .వి. సుబ్బారావు, ఏపీ ఎమ్ఐపిపిడి సుదర్శన్, ఎంఈఓ ఖాదర్ వలీ, వెలుగు ఏపీఎండిప్యూటీ తాసిల్దార్ రమేష్ , ఈవో ఆర్ డి అశోక్ ,ఆ తర్వాత రెండవ గ్రామం చెర్లో పల్లి సచివాలయం వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మోడీ ప్రభుత్వ హామీలపై రూపొందించిన వీడియో చిత్రాలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్, జలజీవన్ మిషన్, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన ,పీఎం ప్రణాo తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులతో పథకాల అమలు గురించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అర్హత ఉండి పథకాలు లబ్ధి పొందక పోయి ఉంటే అలాంటి సమస్యలు ఉన్నవారు వివరాలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. అలాగే గ్రామంలోని లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లీలావతి, ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ హనుమంత్ రెడ్డి, ప్రభుత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపిఓ శివకుమారి మాట్లాడుతూ నేటి ఉదయం తొలి రోజు జిల్లాలోని పుట్టపర్తి మండలం బొంతలపల్లి, చెర్లోపల్లి గ్రామాలతో పాటు ధర్మవరoమండలంలోని

పోతుకుంట, కుణుతూరు గ్రామపంచాయతీలలోపెనుకొడ మండలంలోని గుట్టూరు ,ఎర్రమంచి గ్రామపంచాయతీలలో

కదిరి మండలంలోని ముత్యాల చెరువు, కోండమనాయని పల్లి గ్రామపంచాయతీలలో కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు జరిగాయని జిల్లా పంచాయతీ అధికారి శివకుమారి తెలిపారు. అనంతరం జాతీయగీతం గేయాలపనతో కార్యక్రమాలు ముగిసాయ.