పేదింటి ఆడబిడ్డ మానస గౌడ్ పెళ్లికి అండగా నిలిచిన పంజాల శ్రీనివాస్ గౌడ్..

 

 

దుద్దెడ గ్రామానికి చెందిన కూటిగంటి రేణుక వెంకటేష్ గౌడ్ ల కూతురు మానస వివాహం ఈనెల 29వ తేదీన ఉన్నందున రేణుక వెంకటేష్ గౌడ్ ల కుటుంబం పేద కుటుంబం అయినందున ఆ విషయాన్ని తెలుసుకున్న దుద్దెడ గ్రామ *ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పంజాల శ్రీనివాస్ గౌడ్* *గారు* ఈరోజు దుద్దెడలోని వారి ఇంటికి వెళ్లి *ఆడబిడ్డ పెళ్లికి అండగా 10000* రూపాయలు ఇవ్వడం జరిగింది.

పేదింటి కుటుంబాలకు తన దృష్టికి వచ్చిన ప్రతి విషయంలో కొండంత అండ అవుతున్న పంజాల శ్రీనివాస్ గౌడ్ గారిని బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, ఎండి మొహినుద్దీన్, మిద్దె శివకుమార్, మిద్దె రమేష్ అభినందించడం జరిగింది…… ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీనివాస్ గౌడ్ గారికి మానస తల్లిదండ్రులు రేణుక వెంకటేశం గౌడ్ గార్లు ధన్యవాదాలు తెలిపారు……