టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆయన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక జక్కన్న తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో తీయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రాజమౌళి కూడా నటించబోతున్నరనే వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది. మొదట రాజమౌళి నటుడు కావాలనే ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ, డైరెక్టర్ అయ్యారు. అయితే మహేష్ తో చేసే సినిమాలో ఎలాంటి పాత్రలో అలరిస్తాడో చూడాలి.