Headlines

ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్, హనుమాన్ నగర్ లో జరిగిన ప్రజా పాలన దరఖాస్తు దారుని డాక్యుమెంట్ పరిశీలన..

ఈరోజు అనగా 10-02-2024, శనివారం ఉదయం 9:00 AM, గంటలకు

ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్, హనుమాన్ నగర్ లో జరిగిన ప్రజా పాలన దరఖాస్తు దారుని డాక్యుమెంట్ పరిశీలన అనగా ఆరు పథకాలలో ఒకటైన 200 యూనిట్స్ – ఉచిత యూనిట్స్ సంబంధించి డాక్యుమెంట్స్ పరిశీలన కొరకై DE సుభాష్ గారు, AD శ్రీనివాస్ రెడ్డి గారు, AE వెంకట్ రెడ్డి గారు మరియు లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. 2024-2025 కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు గ్యారంటీ పథకాల కోసం ఓటాను అకౌంట్ బడ్జెట్లో 53 వేల 196 కోట్లు కేటాయిస్తుందని ఒక అంచనా. ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫారుక్ అలీ, మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ భాయ్, అజీమ్ భాయ్ మరియు దరఖాస్తుదారులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్వితీయంగా పాలిస్తుందని అభినందించారు.