Headlines

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం..

న్యూస్.9)

 

 

యాడికి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అనంతపురం జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పల్లెకి పోదాం కార్యక్రమం యాడికి మండలాధ్యక్షుడు చింత చౌడయ్య నిర్వహించడం జరిగినది. పల్లె కి పోదాం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాపరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి కొకన్వీనర్ గంగాధర్ తాడిపత్రి టౌన్ జనరల్ సెక్రెటరీ భీమ లింగేశ్వర్ రెడ్డి జిల్లా విస్తారక్ విజయభాస్కర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు అయోధ్య రామాలయం పూర్తి చేసిన సందర్భాల గురించి ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు సేకరించడం రైతులకు నరేంద్ర మోడీ ఇస్తున్న ఎరువు బస్తాల సబ్సిడీల గురించి మరియు ప్రతి రైతుకి అకౌంట్లో వారికి ఆరువేల రూపాయల చొప్పున వేస్తున్న రని అలాగే ప్రతి రేషన్ కార్డుకి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని ఈ విషయాలు యాడికి చందన లక్ష్యంపల్లి, కేశరాంపేట, ఉప్పలపాడు ప్రజలకు రైతులకు తెలియజేయడం జరిగింది. కొంతమంది రైతులు నరేంద్ర మోడీ చేస్తున్న మేలు మరువలేనిది అని తెలియజేసి బూత్ కమిటీలకు మేము సిద్ధంగా మా వంతు సాయం చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషకరం పల్లె ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాడికి మండల బిజెపి పార్టీ సభ్యులు మండల అధ్యక్షుడు చింత చౌడయ్య జిల్లా కార్యదర్శి పండు లక్ష్మీదేవి ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ చేనేత అధ్యక్షుడు సుధాకర్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రఘువీరాచారి కంబగిరి రాముడు ఓబిసి సెక్రెటరీ కృపాకర్ కార్యదర్శి రామకృష్ణ సురేష్ బిజెపి కమిటీ సభ్యులు శంకర్, నల్లప్ప ,ప్రసాద్ ,శివ ప్రసాద్ ,నరసింహ పాల్గొన్నారు