రెండో విడత దళిత బంధు అమలు చేయాలని జెసికి మెమో రాండం అందించిన దళితులు..

 

బూర్గంపాడు 13 న్యూస్9

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని దళితులు ఏకమై , భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, రెండో విడత దళిత బంధు సభ్యుల జాబితా ప్రకారం అర్హులైన వారికి, దళిత బంధు అందే విధంగా చూడాలని బూర్గంపాడు దళిత బంధు సాధన కమిటీ సభ్యులు కలెక్టరేట్ కార్యాలయంలో మెమోరాండం అందించారు. గత ఎన్నికలకు ముందు దళిత బంధు అమలు చేస్తున్నట్లు విడుదల చేసిన జాబితా ప్రకారం బూర్గంపాడు మండలం కు చెందిన దళిత సభ్యులకు దళిత బంధు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండంఅందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సారపాక టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, ఎస్సీ సెల్ నాయకులు వలం దాసు సాలయ్య, దళిత బంధు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.