మంత్రి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలి. మాజీ మున్సిపల్ చైర్మన్ : పుట్ట శైలజ… మాజీ జెడ్పిటిసి: తగరం సుమలత..

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని

చేరాల.రవీందర్

 

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ ( రాజాగృహా) కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతగల మహిళా మంత్రి మహిళల పట్ల అనుచిత వాక్యాలు చేయడం చాలా బాధాకరమని ఈ సమాజంలో మహిళలను దేవతమూర్తులుగా కొలిచే సంస్కృతి మనదని అలాంటి మహిళలపై ఒక మహిళా మంత్రి అయి ఉండి అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందని వెంటనే నటి సమంతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో కొండా సురేఖ పై కొందరు వ్యక్తులు పోస్ట్ పెట్టారని ఆ విషయంలో ఎంతో మనోవేదన గురయ్యానని అన్న మంత్రి కొండ సురేఖ నటి సమంత వ్యక్తిగత జీవితంపై అనుచిత వాక్యాలు చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయడంలో విఫలమై హైడ్రా పాలసీని తీసుకొచ్చి ప్రజల దృష్టి నీ తప్పు దోవ పట్టించడానికి మహిళా మంత్రితో మాట్లాడిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పుట్ట శైలజ అన్నారు.

ఈ సమావేశంలో మహిళా నాయకురాళ్లు మాజీ జెడ్పిటిసి సుమలత- శంకర్ లాల్, బుద్ధార్తి రాణి, పుట్ట పద్మ లతో పాటు మహిళ నాయకులు పాల్గొన్నారు.