ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు స్వాగతం పలికిన టిడిపి నాయకులు..

న్యూస్.9)

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా పయ్యావుల కేశవ్ మొదటి సారి అనంతపురం జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లా సరిహద్దులోని కరటికొండ వద్ద తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, యాడికి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. యాడికి మండలం నుండి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య,రవి కుమార్ రెడ్డి, వెలిగండ్ల ఆదినారాయణ, దడియాల ఆది, అమిలినేని సత్య,తాండ్ర విక్రమ్, నగరూరు నరసిం హులు, గోపాల్ నాయుడు, శుభాన్,చంద్ర, శ్యామ్ సుందర్ యాడికి టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు