ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నీటి విడుదల..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 17::

మండలంలోని ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి జడ్పిటిసి సీతమ్మ చేతులమీదుగా సోమవారం నీటిని విడుదల చేశారు. తొలుత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ.. రైతన్నలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో ముందుగానే నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్ మునేందర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.