సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో భేటీ..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన సచివాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి. సచివాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు.

 

అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవనున్నారు. బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

అంతకుముందు అమరావతి రైతులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఆయనకు రాజధాని రైతులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీ కొనసాగింది. పవన్ కల్యాణ్ ర్యాలీ తీసినంత సేపు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు.