ఘనంగా వై యస్ అర్ 75వ జయంతి వేడుకలు…

న్యూస్.9)

యాడికి మండల ఎంపీపీ ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని శాంతి నగర్ నందు వైస్సార్ విగ్రహానికి భారీ పూల మాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు . ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటరామి రెడ్డి , బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు,బొంబాయి రమేష్ నాయుడు గారి తనయులు ఉపేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ స్వర్గీయలు దివంగత జనహృదయ నేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరు వై యస్ అర్ రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగేది అలాగే ఈరోజు రాష్ట్ర ప్రజలకు రైతులకు పంటభీమా, ఇన్ పుట్ సబ్సిడీ రైతులకు నేరుగా అకౌంట్ లలో చేరేవి అని గుర్తు చేసారు అలాగే మన మండలం తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే దివంగత నేత మన ప్రియతమ నేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్లే జరిగింది అని గుర్తుచేసుకొన్నారు మరియు రాష్ట్ర ప్రజలు వై యస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పటికి మర్చిపోరని ప్రతి రైతు గుండెలో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారని తండ్రి కి తగ్గ తనయుడుల మన రాష్ట్ర మాజీ సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోనే కొనసాగుతాం అని తెలపడం జరిగింది .మరియు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వైస్ ఎంపీపీ చెన్నప్ప,ఎంపీటీసీ సభ్యులు గొడ్డుమర్రి రామమోహన్, పామిశెట్టి నాగరాజు,వార్డుమెంబెర్స్ గుంత తిరుపతి,మేకల రామచంద్ర, బాలపెద్దయ్య, పరమేశ్వర రెడ్డి, శ్రీధర్ మరియు ఉప్పలపాడు బాల గంగయ్య,గంగిరెడ్డి, బలహిమ సాగర్,వెంకటశివ రెడ్డి, సానిక చంద్రశేఖర్ రెడ్డి, కొమ్మ ప్రసాద్ రెడ్డి, సాంబ శివుడు, పద్మనాభ రెడ్డి, పరిమి చిన్న వెంకట నాయుడు, జగదీష్,చందన వెంటరామి రెడ్డి,నగరుర్ రుక్మానంద రెడ్డి, మబ్బు సుదర్శన్ రెడ్డి, పేరం దేవేంద్ర, జక్కిరెడ్డి మధు,కోట చౌదరి, పండు శ్రీరాములు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

జోహార్ వై యస్ అర్