జర్నలిస్టులకు రైల్వే పాసులు మంజూరు చేయాలి: జాప్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జనరల్ సెక్రెటరీ జోగిరెడ్డి — ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరిన జాప్ కమిటీ సభ్యులు..

అనంతపురం

న్యూస్.9)
జర్నలిస్టులకు రైల్వే పాసులు మంజూరు చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జనరల్ సెక్రెటరీ జోగిరెడ్డిలు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ను జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, జిల్లా జనరల్ సెక్రెటరీ జోగిరెడ్డి మాట్లాడుతూ గతంలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాస్ మంజూరు చేసేవారిని ప్రస్తుతం రైల్వే బస్సులు మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు రైల్వే పాసులు మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని ఎంపీ ని కోరారు. అలాగే టోల్ ప్లాజా లో జర్నలిస్టుల వాహనాలకు టోల్ రుసుము మినహాయింపు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు అందరికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఇళ్ల స్థలాల మంజూరు చేసి డబల్ బెడ్ రూమ్ ప్లాటు నిర్మించి ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాప్ యాడికి మండల అధ్యక్షుడు సారెడ్డి రామచంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, సుధాకర్, రహంతుల్లా, రవి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.