యాడికి మండలంలోని రాయలచెరువులోని సప్తగిరి రైస్ మిల్ నందు లయన్స్ క్లబ్ కొత్త సభ్యుల ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది..

న్యూస్.9) యాడికి మండలంలోని రాయలచెరువులోని సప్తగిరి రైస్ మిల్ నందు లయన్స్ క్లబ్ కొత్త సభ్యుల ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాస్ట్ గవర్నర్ రమేష్ నాథ్ రెడ్డి, VDG1 గోపాలకృష్ణ, VDG2 వీరుపాక్షి రెడ్డి హాజరయ్యారు. ముందుగా అతిథులందరూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు మెలివిన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 2023- 24 సంవత్సరపు అధ్యక్షులుగా పనిచేసిన రవి కుమార్ రెడ్డి గారు 150కి పైగా సేవా కార్యక్రమాలు చేసి రాయల చెరువు లయన్స్ క్లబ్ ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపారని, ఈ సంవత్సరపు కొత్త అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న చల్లా సూర్యనారాయణ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి రాయలచెరువు లయన్స్ క్లబ్ ను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. వీరుపాక్షి రెడ్డి మాట్లాడుతూ… ఒక్క సంవత్సరంలోనే ఏడుసార్లు కంటి ఆపరేషన్ల శిబిరాన్ని ఏర్పాటు చేసి చూపు లేనటువంటి వారికి ఎందరికో చూపులు అందించి అందరి మన్ననలు పొందరని రవికుమార్ రెడ్డి సేవలను కొనియాడారు. రాయల చెరువు లయన్స్ క్లబ్ కు గత 19 సంవత్సరాల నుండి ఆఫీస్ అనేది ఉండేది కాదని, రవికుమార్ రెడ్డి అధ్యక్షతన సభ్యులందరి సహకారంతో ఆఫీసును నిర్మించడం గొప్ప విషయమని గోపాలకృష్ణ తెలిపారు. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క లయన్ సభ్యుడికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రవికుమార్ రెడ్డి తెలిపారు. కొత్త అధ్యక్షులు చెల్లా సూర్యనారాయణ మాట్లాడుతూ రవికుమార్ రెడ్డి గారి సేవలను ఆదర్శంగా తీసుకొని వారి సహకారంతో, మిగిలిన సభ్యులందరి సహకారంతో మంచి సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ ను ముందుకు తీసుకెళుతానని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుత్తి,గుంతకల్, తాడిపత్రి, లయన్స్ క్లబ్ సభ్యులు రవికుమార్ రెడ్డి గారిని అలాగే కొత్త అధ్యక్షులు సూర్యనారాయణ గారిని, సెక్రటరీ రామకృష్ణ, ట్రెజరర్ రామ్మోహన్ రెడ్డిని శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్ భీమిలింగప్ప,రంగయ్య, కులశేఖర్ నాయుడు, ప్రసాద్,ఇస్మాయిల్,రవి ప్రసాద్, సత్యనారాయణ,మాదాల అనిల్ కుమార్సూర్య నారాయణ, జయరాం రెడ్డి ,అల్లా బకాష్, శేషానంద రెడ్డి,మురళీకృష్ణ,రాజశేఖర్, నిదనాడు రామకృష్ణ, నాగరాజు,ప్రవీణ్, రవి కిరణ్, కొత్త లియో అధ్యక్షులు మంజునాథ్, మొదలగు వారు పాల్గొన్నారు.