వదినమ్మ వచ్చేసింది.. ఆడపడుచు ఫుల్ ఖుష్

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూ.. కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.

నిహారికకు ఆమె అన్న వరుణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి పనిలో సపోర్ట్ గా ఉంటాడు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. నిహారిక విడాకులు ఇచ్చినప్పుడు కూడా కుటుంబం ఎంతో సపోర్ట్ గా నిలిచింది. ఇక ప్రతి చెల్లి.. అన్న పెళ్లి ఎప్పుడు అవుతుందా .. ? హంగామా ఎప్పుడు చేయాలా.. ? అని ఎదురుచూస్తూ ఉంటుంది. నిహారికకు ఆ సమయం రానే వచ్చింది. నిన్న ఇటలీలో వరుణ్ – లావణ్య పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఆ పెళ్ళిలో ఆడపడుచుదే హడావిడి అంతా. అన్న పెళ్ళిలో తండ్రి నాగబాబుతో కలిసి తీన్మార్ స్టెప్స్ వేసి అలరించింది.

 

ఇక వదిన లావణ్య- నిహారిక.. మొదటి నుంచి ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. నిహారిక పెళ్ళికి వెళ్లిన ఏకైక హీరోయిన్ లావణ్యనే. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ మరియు జిమ్ పార్ట్నర్స్ .. రీతూ వర్మ, లావణ్య.. అందుకే వీరు నిహా పెళ్ళిలో సందడి చేశారు. ఇక అంతకు ముందు నుంచే అన్న ప్రేమాయణం మొత్తం అమ్మడికి తెలుసని తెలుస్తోంది. ఇక వరుణ్- లావణ్య పెళ్లి కూడా దగ్గరుండి చేసిన నిహారిక.. అన్నా వదినలతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వదినమ్మ వచ్చేసింది అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వదినా ఆడపడుచులుగా మారిన ఈ ఫ్రెండ్స్ ముందు ముందు ఎలా ఉండనున్నారో చూడాలి.