శివాజీ వర్సెస్ గౌతమ్.. తొక్క తీస్తానని వార్నింగ్.. ప్రోమో వైరల్

బిగ్ బాస్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది.. ఈ వారం కెప్టెన్ అవ్వడం కోసం జనాలు నువ్వా నేనా అని పోటీ పడ్డారు.. వీర సింహాలు.. గర్జించే పులులు అంటూ రెండు టీములుగా ఇంటి సభ్యులను డివైడ్ చేశాడు బిగ్‍బాస్.

కెప్టెన్సీ కంటెండర్ కోసం జరుగుతున్న ఈ టాస్కులలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్‏ను ఆట నుంచి తప్పించింది వీరసింహాలు టీమ్.. ఇక నిన్నటి టాస్క్ ఈరోజు కూడా జరిగింది.. ఆ టాస్క్ లో బాల్స్ కోసం ఇంటి సభ్యులు తెగ కష్టపడ్డారు.. మొత్తానికి టాస్క్ ను కంప్లీట్ చేశారు..

ఇక ఈరోజు బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.. తాజాగా విడుదలైన ప్రోమోలో.. మరోసారి రెండు టీంలకు షాకిచ్చాడు. కానీ ఈసారి సైతం వీరసింహాలు టీంకే కలిసోచ్చిందని చెప్పాలి. టాస్కు మొదలయ్యే ముందు గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉందో చెప్పాలని అన్నాడు బిగ్‍బాస్. అయితే వీరసింహాలు టీమ్ దగ్గర ఉందంటూ గౌతమ్ చెప్పాడు. దీంతో ఆ టీంకు మరో పవర్ ఉంటుందని, మీ టీమ్ లోని వీక్ పర్సన్ ను అవతలి టీమ్ వారితో సమానం చేసి చూడొచ్చు అని ఆఫర్ ఇచ్చాడు..

దీంతో తమ టీంలోని భోలోను పంపించి.. అవతలి టీంలోని అర్జున్‍ను తీసుకున్నారు గౌతమ్ టీం. ఇక ఆ తర్వాత టాస్కు మొదలుకావడంతో .. అవతల టీంకు ఒక్క బాల్ కూడా దొరకనివ్వకుండా అడ్డుకునేందుకు అర్జున్ ట్రై చేయగా.. అమర్ దీప్ ఏకంగా అర్జున్ పైకి ఎక్కేశాడు. ఆ తర్వాత ఈరోజు టాస్కు సమయం ముగిసిందని.. మీ దగ్గరున్న బాల్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ బిగ్‍బాస్ ప్రకటించాడు… అయితే బాల్స్ ను దొంగతనం చేసే ప్రయత్నం చేయనున్నారు..ఈరోజు రాత్రి వాటిని కొట్టేయాలంటూ కామెడీ చేశాడు తేజ. తొక్క తీసెస్తా నా వాటి జోలికి ఎవరైనా వస్తే అంటూ శివాజీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అమర్ ను పట్టేసుకుని అతడి దగ్గరున్న బాల్స్ కొట్టేయడానికి ట్రై చేశారు గౌతమ్.. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తి కరంగా జరగనుంది.. మిస్ అవ్వకుండా చూడండి..