బాలయ్య బాబు షోకి హీరో ప్రభాస్ అలాగే తన స్నేహితుడు అయిన గోపీచంద్

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఇప్పటికే మొదటి సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం రెండవ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే సీజన్ 2 కి యంగ్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు అలాగే దర్శకులు నిర్మాతలు హాజరైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోకి హాజరు కాబోయే గెస్ట్ లకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వార్త విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బాలయ్య బాబు షోకి హీరో ప్రభాస్ అలాగే తన స్నేహితుడు అయిన గోపీచంద్ హాజరు కాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈనెల 11వ తేదీన ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న ప్రభాస్ గోపీచంద్ అభిమానులు ఆ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ప్రభాస్ రాబోయే ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ గోపీచంద్ తెలిసి సందడి చేయబోతున్న ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా ప్రసారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త ప్రకారం ప్రభాస్ నిజంగానే షోకి హాజరైతే ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే ప్రభాస్ ఎపిసోడ్ మరొక ఎత్తు అవుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి సినిమాలతో పాటు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే గోపీచంద్ విషయానికి వస్తే ఇటీవల గోపీచంద్ సిటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గోపీచంద్ చేతిలో మరే ఇతర ప్రాజెక్టులు లేవు.