రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు..సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ..

పత్రిక ప్రకటన

నిర్మల్ జిల్లా, నవంబర్, 29.

 

రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు

సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ

 

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో, ముధోల్ లోని TSWRJC లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్ లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను, సొన్ మడలంలోని ZPSS పోలింగ్ కేంద్రంను జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు సందర్శించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలింగ్ బందోబస్త్, భద్రత పై ఆదేశాలు, పలు సూచనలు చేయడం జరిగింది.

 

ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… నిర్మల్ జిల్లాలో మొత్తం (3) నియోజకవర్గాలు నిర్మల్, భైంసా మరియు ఖానాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో జరిగే ఎన్నికలు 519 పోలింగ్ లొకేషన్లు, మొత్తం పోలీంగ్ బూతులు 743 ఏర్పాటు చేయనైనది. వీటిలో సాధారణ మరియు సమస్యత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలుగా విభజించామని దానికి అనుగుణంగా భద్రత చర్యలు చేపట్టామని తెలియచేసారు. నిర్మల్ జిల్లాలో ఎన్నికలలో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని పోలింగ్ కేంద్రాల చుట్టూ మూడంచల భద్రత వ్యవస్థ పొందుపరిచామని దీనిలో భాగంగా జిల్లా స్పెషల్ పార్టీ, సెంట్రల్ అర్మడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లచే గస్తీ నిర్వహిస్తున్నామని తెలియచేసారు. మారు మూల గ్రామాలకు ఈవీఎంల తరలింపులో భాగంగా ఎటువంటి ఆటంకం రాకుండా ఆకస్మిక వాహనాల తనిఖీ, బైక్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ను, స్ట్రైకింగ్ ఫోర్స్, టీములుగా విభజించామని వీటిలో భాగంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీంతో పాటు అనుకోని సంఘటన సంభవిస్తే దాన్ని ప్రతిఘటించేలా క్విక్ రియాక్షన్ టీంను ఏర్పాటు చేశామని ఇప్పటికే ప్రతి ఒక్క టీం తమ తమ స్థానాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఎస్పీ గారు తెలియజేశారు.