యాడికి మండల కేంద్రంలోనిశ్రీ వివేకానంద హై స్కూల్,,మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్,, యాడికి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..,

న్యూస్.9)

కోన రోడ్డు లోని *శ్రీ వివేకానంద హై స్కూల్* వారి సహకారంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం *శ్రీ వివేకానంద హై స్కూల్* ఆవరణలో ఉదయం తొమ్మిది గంటల నుంచి *శాంతిరాం హాస్పిటల్, కర్నూలు* వారిచే *ఉచిత కంటి వైద్య శిబిరం* నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారికి డాక్టర్లచే పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్సలు ఉచితంగా చేస్తామని హాస్పిటల్ వారు తెలియజేశారు.కావున అటువంటి సమస్యలు ఉన్నవారు ఈ శిబిరం కి హాజరై డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలని తెలియజేస్తున్నాము.ఈ శిబిరం కి వచ్చువారు *ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు* తీసుకుని హాజరు కావాలని *మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి* వారు కోరుతున్నారు.ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆపరేషన్ అవసరమైన వారు ఒక జత బట్టలు, ఒక బెడ్ షీట్, ఒక సహాయకుడిని వెంటపెట్టుకొని వెళ్లవలసి ఉంటుందని వైద్యులు తెలిపారు.మీ ఇంటిలో కానీ మీ చుట్టుపక్కల వారిలో ఇటువంటి సమస్యలు ఉన్నవారికి ఈ *ఉచిత కంటి వైద్య శిబిరం* గురించి తెలియజేయాలని *మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి* ద్వారా కోరుతున్నాము.

 

ఇట్లు

*మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి*