Headlines

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంబేధ్కర్ గురుకుల పాఠశాలలు….

  • కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంబేధ్కర్ గురుకుల పాఠశాలలు….
  • – నాడు నేడుతో పాఠశాలలకు నూతన శోభ
  • – త్వరలో విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 30:

విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంబేధ్కర్ గురుకుల పాఠశాలలు దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిక్సూచిలా నిలిచిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం మండలం అరుగొలనులో 22 కోట్ల 17 లక్షల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల నూతన విద్యాలయం భవనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున మాట్లాడుతూ విద్యతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమనీ గ్రహించిన మన ముఖ్యమంత్రి విద్య కోసం కొట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఉచితంగా యూనిఫామ్ నుండి పాఠ్యపుస్తకాలు వరకు అందజేయడం జరుగుతుందన్నారు.
అలాగే 8వ తరగతి విద్యార్థులకు టాబ్లు, ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడం, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం, మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను విద్యాభివృద్ధిలో భాగంగా చేపట్టడం జరిగిందన్నారు. విద్యా రంగంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం నడిబొడ్డు విజయవాడలో భారతదేశంలోనే ఎత్తైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎన్నో గొప్ప సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న మన ముఖ్యమంత్రిని ఏ విధంగాను ఎదుర్కొనలేక నిరాధారమైన ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నారు. ప్రజలు వాస్తవ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు నాయకులను ఎంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యను నేర్చుకుని విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు సాధించాలని కోరారు. విద్యతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని విద్యార్ధులు తమ బంగారు భవిష్యత్తుకు విద్యార్ధి స్థాయి నుంచే బాటలు వేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యారంగంలో భారతదేశంలోనే విప్లవతకుమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. తాడేపల్లిగూడెంను విద్యా హబ్ గా చేస్తామని తెలిపారు. ఇప్పటికే నిట్, నన్నయ్య యూనివర్శిటీ, డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టీకల్చరల్ యూనివర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటితో పాటు పెదతాడేపల్లిలో 645 మంది విద్యార్థులతో కొనసాగుతున్న గురుకుల పాఠశాలకు నూతన భవనాల ఏర్పాటుకు సుమారు 35 కోట్ల వ్యయం అవుతుందని దానికి నిధులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కేటాయించవలసిందిగా వారు కోరారు. ఆరుగొలనులో నేడు నూతనంగా ప్రారంభించుకున్న గురుకుల విద్యాలయం సరైన రహదారి మార్గం లేకపోవడంలో ఉన్న ఇబ్బందులను గ్రహించి ఏడు కోట్ల రూపాయలకు నిధులతో జాతీయ రహదారి నుండి మురుకుల పాఠశాల అనుకొని రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాడేపల్లిగూడెంలో చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు. నేడు ప్రారంభించుకున్న గృహంలో నికి ఎప్పుడు మారతామా అని ఈ విద్యార్థులందరూ ఎదురుచూస్తున్న రోజు నేడు సాకారం అయిందన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, గురుకుల విద్యాసంస్థ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు, బి. రాజారావు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల డిసిఓ ఎన్. భారతి, తాహసిల్దార్ దుర్గా కిషోర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. శోభారాణి, ఎస్సీ కమిషన్ సభ్యులు పుల్లారావు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.