మరోసారి బరిలోకి డోనాల్డ్ ట్రంప్…

. అమెరికా అధ్యక్షుడిగా  దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. మంగళవారం రాత్రి ఆయన రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కోరుతూ ప్రకటన చేశారు. మార్ ఎలాగో ఎస్టేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాను మరోసారి గొప్ప ప్రకాశవంతంగా చేసేందుకు గానూ అధ్యక్ష పదవికి ఈ రాత్రి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నానని ప్రకటించారు. మార్ ఎలాగో ఎస్టేట్ కేంద్రంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ దాదాపు గంట సేపు ప్రసంగించారు. Donald Trump అమెరికాను తిరిగి నిలబెట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా చైనా, సౌదీ దేశాలపై పెత్తనం చెలాయించేది. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించేది. ఉత్తరకొరియా అణ్వ యుధాలతో భయపెట్టినప్పుడు కిమ్ ను మచ్చిక చేసుకున్నాడు. ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకరికి ఒకరు కానుకలు పంపించుకున్నారు.

అప్పట్లో ఇది ఒక సంచలనంగా మారింది. ఇక అమెరికాకు సంబంధించిన దౌత్యపరమైన విషయాల్లో ట్రంప్ దూకుడుగా ఉండేవారు. ఆ తెగువ వల్లే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దూరంగా ఉంది. కానీ బైడెన్ అధ్యక్షుడైన తర్వాత దౌత్య పరంగా అమెరికా చాలా వీక్ అయింది. దీనివల్ల రష్యా గుడ్లు ఉరిమింది. నాటోను పోపోవోయ్ అని ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. . పాపులారిటీ ఉన్న నాయకుడు ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో డోనాల్డ్ ట్రంప్ ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు. కానీ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించినంత స్థాయిలో అతడి పార్టీకి విజయాలు దక్కలేదు.. ఇక 2020లో ఎన్నికల అవకతవకల ఆరోపణల విషయంలో ట్రంప్ పక్షాన నిలిచిన చాలామంది అభ్యర్థులు మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

అయితే పరిస్థితి ఇలానే ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని ట్రంప్ ప్రకటించుకున్నారు.. దీనిద్వారా రిపబ్లికన్ల మద్దతు పొందాలి అనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.. అయితే ఈసారి అధ్యక్ష పదవి బరిలో నిలిచేందుకు చాలామంది తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.. అందులో ఫ్లోరిడా గవర్నర్ రోన్ దేశాంటి స్ కూడా ఉన్నారు. ఇక ట్రంప్ తొలిసారి బరిలో దిగిన సమయంలో ఆయనకు ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు.. దీంతో ఓటర్లు సరికొత్త పాలన లభిస్తుందని ఆశలతో ఆయనకు ఓటేశారు.. కానీ ఆయన అధికారులకు వచ్చాక కొన్ని విధానాల్లో విజయం సాధించారు. Donald Trump మరికొన్నింట్లో తీవ్ర వైఫల్యాలు ఎదుర్కొన్నారు. మౌలిక వసతుల్లో పెట్టుబడులు అనే అతడి వాగ్దానం అసలు నెరవేరలేదు. దీనికి తోడు కోవిడ్ సమయంలో ట్రంప్ వ్యవహార శైలి వంటివి ఆయనను వెంటాడాయి. అయితే అదే సమయంలో భారత్ నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడంతో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పనితీరుపై విమర్శలు వెల్లు వెత్తాయి.

ఇక జనవరి ఆరవ తేదీన వాషింగ్టన్ డిసి లో జరిగిన ఘటనలు అతని వ్యక్తిత్వానికి మాయని మచ్చగా మిగిలాయి. ఇవి అమెరికా పరువును బజారున నిలబెట్టాయి. అయితే ఇన్ని పరిణామాలు కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అవుతారా అనేది తేలాల్సి ఉంది. అప్పట్లో వాషింగ్టన్ డిసి ఘటన తర్వాత ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను ట్విట్టర్ డిలీట్ చేసింది. ఇంతవరకు దాన్ని పునరుద్ధరించలేదు. ట్విట్టర్ ఎకౌంట్ ని పునరుద్ధరించుకోలేనివాడు అమెరికా అధ్యక్షుడు మళ్లీ ఎలా అవుతాడని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మరో వైపు ఇండోనేషియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ట్రంప్ అభ్యర్థిత్వంపై విలేకరులు ప్రశ్నించగా తాను వ్యాఖ్యానించకోదల్చుకోలేదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అదే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ కూడా ఉన్నారు.