Headlines

యాడికిమండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో , బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత..

న్యూస్.9)

తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక యాడికి పట్టణంలోని రజక వీధి వార్డులో సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసిన తెలుగు యువత విభాగం.

టిడిపి పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో రజక వీధి, ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఓటేసి ,వేయించి, గెలిపించి యాడికి మండల అభివృద్ధికి సహకరించాలని, అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సాధ్యమవుతాయని తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తీరం పురం నీలకంఠ, ఉపాధ్యక్షుడు వెంకటేష్, టి కేశవ, చలపతి, టి. వాసు, విశ్వనాథ,మాయ కుంట్ల నారాయణస్వామి, బోయ పాండు, బోయ రవి, మైనార్టీ విభాగం సెల్ పాయింట్ చాంద్ బాషా, కరెంటు రహమతుల్లా, వెంకటాద్రి, పత్తికొండ బాలు, యువరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.