జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి శుక్రవారం ప్రెస్ మీట్

పత్రిక ప్రకటన
తేది:03.11.2023
నిర్మల్ జిల్లా శుక్రవారం

ప్రెస్ మీట్
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి
శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సంధర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. మాట్లాడుతూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు నుండీ ( నవంబర్ మూడవ తేదీ ) నామినేషన్లు ప్రారంభమయ్యాయని ఆన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో 244 లొకేషన్ లలో 305 పోలింగ్ స్టేషన్ లు, నిర్మల్ నియోజకవర్గంలో 190 లొకేషన్ లలో 306 పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా
ముధోల్ నియోజకవర్గం లోని 230 లొకేషన్ లలో 311 పోలింగ్ స్టేషన్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలలో 664 లొకేషన్ లలో 922 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
ఈ మూడు నియోజకవర్గాలలో నిర్మల్ ముధోల్ నియోజకవర్గం జనరల్ స్థానాలు కాగా ఖానాపూర్ నియోజకవర్గం మాత్రం ఎస్టి వర్గానికి కేటాయించబడిందన్నారు ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నదని, అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఇంద్రవెల్లి సిరికొండ మండలాలు మంచిర్యాల జిల్లాలోని జన్నారం ప్రాంతాలు మిగిలిన ప్రాంతాలు నిర్మల్ జిల్లాలో ఉన్నాయని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందించబడతాయని అన్నారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం చేత గుర్తించబడిన 12 ధ్రువీకరణ పత్రాలు పాన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్, MGNREGA జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదలగునవి తీసుకెళ్లవచ్చని అన్నారు.

ఎన్నికల ఖర్చు నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎస్ ఎస్ టి ఎఫ్ ఎస్ టి వి ఎస్ టి లు ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయని అంతర్రాష్ట్ర అంతర్ జిల్లా చెక్ పోస్టుల వద్ద పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

సి విజిల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎన్నికల నియమావళి అతిక్రమన జరిగితే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు రికార్డు చేసి యాప్ లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల లోపు తగిన చర్య తీసుకోబడుతుందని తెలిపారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాలంటే కచ్చితంగా ఎం సి ఎం సి కమిటీ అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. ఈ కమిటీ చెల్లింపు వార్తల పై నిఘా lఉంచుతుందని అన్నారు.

సువిధ ఆప్ ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు మీటింగ్ ల కోసం యాప్ లోనే అనుమతి కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ లో నామినేషన్ వేసి దానికి సంబంధించిన డబ్బు మొత్తాన్ని చెల్లించవచ్చని అన్నారు.
నామినేషన్ షెడ్యూలు నవంబర్ 3 నుండి పదవ తారీకు వరకు ఉదయం 11 గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుందని అన్నారు.
దివ్యాంగుల కొరకు సాక్ష్యం యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ దగ్గర ర్యాంప్ సౌకర్యాలు, మూడు చక్రాల సైకిళ్లు వాహనాలు, సమకూర్చబడతాయని అన్నారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారి నేర చరిత కు సంబంధించి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో, నవంబర్ 19 కంటే ముందు ఒకసారి, నవంబర్ 20 నుండి 23 మద్యన ఒకసారి, నవంబర్ 24 నుండి 28 మద్యన ఒకసారి మొత్తం మూడు సార్లు ప్రకటించాలని అన్నారు.
రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు పోలింగ్ కు 48 గంటల ముందే నిషేధించబడతాయని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే 2 సి ఏ పి ఎఫ్ బలగాలు వచ్చాయని, వీటితో పాటు మరో 6 సి ఏ పి ఎఫ్ బలగాలు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, అంతర్ జిల్లా చెక్ పోస్టులు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి,లాంటి టీమ్ లతో సి ఏ పి ఎఫ్ బలగాలు సమన్వయం తో పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలంతా కూడా ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని, పోలీస్ వ్యవస్థ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో. జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.