ఓటు అడగడానికి వెళ్లిన బిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

ఓటు అడగడానికి వెళ్లిన బిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాదానికి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులకి ప్రజల నుండి చేదు అనుభవం ఎదురైంది తానూర్ మండలంలోని హంగిర్గా గ్రామంలో మంగళవారం బిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పలు కాలనీ వాసులు ఎన్నికలు వస్తేనే మేము గుర్తుకొస్తామా అంటూ నాయకులను నిలదీశారు.ఇంటింటికి నల్ల కల్పిస్తామని,సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వేయలేదని తీవ్రంగా ఆగ్రహించారు.డ్రైనేజీ కాలువలు సరిగా లేవని ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారా అని గ్రామంలో సీసీ రోడ్డుకి కొబ్బరికాయ కొట్టి పనులు చేయలేదని నిలదీశారు