Headlines

సమాచార హక్కు చట్టం సామాన్యుల వరం – కొండపాక మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల తనిఖీ

 

కొండపాక: సమాచార హక్కు చట్టం సామాన్యులకు ఒక వరమని సీసీఆర్ సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండ్ల శివచంద్రం, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ సాజిద్ పాషా తెలిపారు. బుధవారం కొండపాక మండల కార్యాలయంలో రికార్డులను పరీశీలించారు… సమాచార హక్కు చట్టం ప్రకారం సంస్థ కోరిన సమాచారం మేరకు కార్యాలయ సిబ్బంది పర్యవేక్షణలో రికార్డులను తనిఖీ నిర్వహించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు ల తనిఖీ లకు సీసీఆర్ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్నామని రికార్డుల తనిఖీలు చేయడానికి అధికారులు బుధవారం అనుమతి ఇచ్చారని ఉదయం ప్రారంభమైన తనిఖీ సాయంత్రం వరకు కొనసాగిందని తెలిపారు… రికార్డులకు సంబంధించిన విషయాలను తరువాత ఉన్నతాధికారులకు అందించనున్నామన్నారు…జిల్లాలో ఇప్పటివరకు 3 గ్రామపంచాయతీ లో సంస్థ తరుపున రికార్డులను తనిఖీలు నిర్వహించామని తెలిపారు… ప్రాదర్శక పాలనకోసమే సీసీఆర్ సంస్థ పాటుపడుతుందని అన్నారు..సమాచార హక్కు చట్టం సామాన్యులకు అందుబాటులో వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. సమాచార హక్కు చట్టాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాజు,సురేందర్ రెడ్డి, ఇల్యాసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు…