Headlines

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా ఎంపీ గారు కేక్ కట్ చేసి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

 

అనంతరం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు మాట్లాడుతూ మహిళలు ఆది శక్తికి మారుగా నిలిచి, సర్వం తామై ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అన్న మాటను అందరూ మర్చిపోయే లాగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొంటూ ఎంపీ గారు మహిళల శక్తిని కొనియాడారు

 

రాష్ట్రంలోని మహిళల సాధికారత,స్వావలంబనే ధ్యేయంగా మహిళలకు భరోసా కలిపించి వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ ఫలాలు మహిళలకు అందాలని, వారు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అందులో భాగంగానే అమ్మఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను అదే విధంగా మహిళల భద్రత కోసం దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు నాంది పలికిన సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని ఎంపీ గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం చైర్మన్ కాశీ బాలముని కుమారి గారు, జెడ్పీటీసీ కొనుకు గౌతమి గారు, వైస్ ఎంపీపీ వడ్డీ గంగా గారు, ఎంపీటీసీ పులుసుగంటి రాజేశ్వరి గారు , సర్పంచ్ లు రాపాక విజయలక్ష్మీ గారు, బర్రె సీతారత్నం గారు, మహిళా నాయకులు పాల్గొన్నారు