Headlines

ఓటు వజ్రాయుదంలాంటిది..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 11:

ఓటు వజ్రయదంలాంటిదని ఏపీ నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (ఏపీ నిట్ )లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం సాయంత్రం ఆయన ఓటుహక్కుపై ఆవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైనదని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని తెలిపారు. 18 సంవత్సరాలునిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పారు., ప్రతి పౌరుడు ఓటుహక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటుకి నోటు తీసుకోకుండా సమాజానికి మేలు చేసే నాయకులను ఎన్నుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కుపై తల్లిదండ్రులతోపాటు చుట్టుపక్కల వారిని కూడా చైతన్యపరచాలని వివరించారు. క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.