Headlines

ఎక్కడా లేని పెట్రో ధరలు మన రాష్ట్రంలోనే, ఇదేం కర్మ మన రాష్ట్రానికి పెట్రో బాదుడుతో ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్యుల నడ్డి విరుస్తోంది…

ఎక్కడా లేని పెట్రో ధరలు మన రాష్ట్రంలోనే, ఇదేం కర్మ మన రాష్ట్రానికి
పెట్రో బాదుడుతో ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్యుల నడ్డి విరుస్తోంది…

బండారు సత్యానందరావు
రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ పై అధిక పన్ను విధిస్తూ ధరల పెరుగుదలకు కారణం అవుతుందని సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం
ఆత్రేయపురం గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇంధనంపై అమ్మకం పన్ను తగ్గించగా మన రాష్ట్రంలో ఒక్క పైసా కూడా తగ్గించకుండా ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుంది అన్నారు.. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై రూ. 14,724 కోట్ల ఆదాయం లభించగా ఈ ఏడాది రూ.17000 కోట్లకు పైబడి ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొనలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని, అమరావతితో పోల్చుకుంటే పుదుచ్చేరిలో లీటర్ పెట్రోల్ రూ.15.71, డీజిల్ 13.28 బెంగళూరులో లీటర్ పెట్రోల్ పై రూ. 9.93, డీజిల్ 12.02 మనకన్నా తక్కువ ధరకు లభిస్తుందని అన్నారు. గతంలో సైకిల్ పై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు నేడు చిన్న చిన్న మోటార్ సైకిళ్ళపై వ్యాపారాలు సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.. పెట్రో బాదుడు కారణంగా వీరి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రజా సంక్షేమం పట్టని ఈ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ ఉంది వర్గాలు ప్రజలు వాపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకట్రాజు, చిలువూరి సతీష్ రాజు, గెడ్డం సుధ, కాయల కాయల జగన్నాధం, కరుటూరి నరసింహ రావు, ముళ్ళపూడి భాస్కరావు, కట్ట లక్ష్మీ, తోట రజని, చిటికెన సత్యనారాయణ మరియు క్లస్టర్ ఇంఛార్జీలు బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.