Headlines

వైసీపీ ప్రభుత్వంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు

 

కొత్తపేట మండలం – ఖండ్రిగ జంగాల పేట గ్రామం
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయని బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం కండ్రిగలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డ రైతులకు వారి ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వెయ్యడానికి కూడా ప్రభుత్వం రెండు, మూడు నెలలు జాప్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రబీ సాగు చేపట్టిన రైతులకు ఇప్పుడు యూరియా దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఈ పరిస్ధితి ఎన్నడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. విత్తనాలు చల్లడం మొదలుకుని ధాన్యం అమ్ముకునేవరకు పంట నమోదని, ఆన్ లైన్ అని, అదని, ఇదని రైతులను ప్రభుత్వం ఆర్బీకేల చుట్టూ తిప్పుతుందని ఆయన విమర్శించారు. ఎరువులు, పురుగు మందులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇలా అయితే వ్యవసాయం చెయ్యడానికి రైతులు ఎందుకు ముందుకు వస్తారని ఆయన ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు. వెంటనే రైతులకు యూరియా అందివ్వకపోతే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. కంఠంశెట్టి శ్రీనివాస్, గుబ్బల సత్యనారాయణ, రెడ్డి తాతజి, వాసంశెట్టి సత్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, యల్లమిల్లి జగన్మోహన్, రెడ్డి రామకృష్ణ, గుబ్బల మూర్తి, కడలి పార్థసారధి, కుడుపుడి వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇంఛార్జీలు, బూత్ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.