Headlines

ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం

చిత్తూరు జిల్లా

బహుజన సమాజ్ పార్టీ ఐరాల మండల కార్యవర్గ సమావేశం ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి సంగీతం సిద్దయ్య మూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్రబాబు మాట్లాడుతూ మండలంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నుంచి గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామ మరియు బూతు కమిటీలు వేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్, BVF మండల కన్వీనర్ యువరాజ్, బీసీ నాయకులు కావేటిరంగా, బాంసప్ నాయకులు సంగీతం పృద్వితేజ, బీఎస్పీ యువ నాయకులు రమేష్ బాబు, భార్గవ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.