Headlines

గోరుముద్దలో మరో పౌష్టికాహారం..

నేడు కొత్తపేట మండలంలో కొత్త పేట శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ చిర్లా జగ్గిరెడ్డి గారు ప్రారంభించగా మోడేకుర్రు, గొలకోటివారిపాలెం హై స్కూల్ లో సర్పంచ్ శ్రీ రామలక్ష్మి వెంకటేశ్వరరావు గారు అద్యక్షతన ప్రారంభించినారు ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అందిస్తునందుకు జగనన్న ప్రభుత్వానికి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లి తండ్రులు,గ్రామ ప్రజలు కృతాజ్ఞాతలు తెలిపి యున్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ వై సీ పీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ మాస్టర్లు స్కూల్ పిల్లలు పాల్గొన్నారు