Headlines

రావులపాలెం సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో రావులపాలెం సి.ఆర్.సి.నందు నిర్వహిస్తున్న జాతీయ తెలుగు నాటికల పోటీలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు…

రావులపాలెం సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో రావులపాలెం సి.ఆర్.సి.నందు నిర్వహిస్తున్న జాతీయ తెలుగు నాటికల పోటీలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ మసకబారుతున్న నాటకారంగాన్ని ప్రోత్సహించడానికి 23 సంవత్సరాలుగా కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటకాల పోటీలు నిర్వహిస్తూ ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తున్న సి.ఆర్.సి కాటన్ కళాపరిషత్ మరియు కార్యవర్గ సభ్యులను అభినందించారు.

ప్రజలందరూ వచ్చి మంచిమంచి నాటికలు చూసి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.