Headlines

భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేద్దాం..

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ వైష్ణవి గార్డెన్లో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షుడు *నూనె కుమార్ యాదవ్* ఆధ్వర్యంలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపుమేరకు ఏప్రిల్ రెండవ తేదీన కొండపాక మండలం ఆత్మీయ సమ్మేళనం కార్యకర్తల సమావేశం దుద్దెడ వైష్ణవి గార్డెన్లో జరుగుతుందని

అలాగే

ఏప్రిల్ మూడవ తేదీ సోమవారం రోజున కుకునూరుపల్లి మండల కేంద్రంలో కోల ఆంజనేయులు గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ప్రతి గడప గడప నుండి కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని సూచించారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం హహర్నిశలు కష్టపడి కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో చివరికి చావు నోట్లోకి వెళ్లిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడని,

 

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దడానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణగా నిర్మాణం చేస్తున్నాడని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా అమలై రైతులు సంతోషంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు గొప్ప ఏజెండాతో నిర్ణయం తీసుకొని భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగానైతే పనిచేశామో నేడు భారతదేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి కేసీఆర్ గారికి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి సభ్యులు వైస్ ఎంపీపీ దేవి రవీందర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాగాల దుర్గయ్య, ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోలా సద్గుణ రవీందర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహాదేవ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు చిట్టి మాధురి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాల బ్రహ్మం, శ్రీనివాస్ గౌడ్ తో పాటు గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపిటిసిలు, గౌరవ పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రాష్ట్ర,జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……