Headlines

తాడేపల్లిగూడెం యూనియన్ హాస్పిటల్ నందు ఈనెల 16, 17న మెగా ఉచిత వైద్య శిబిరం

తాడేపల్లిగూడెం యూనియన్ హాస్పిటల్ నందు ఈనెల 16, 17న మెగా ఉచిత వైద్య శిబిరం

– పట్టణ, రూరల్ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-ఎండి. డాక్టర్ .కళ్యాణ్ చక్రవర్తి

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 14:

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో
యూనియన్ హాస్పటల్ నందు ఈ నెల 16 17 వ తేదీ శనివారం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తాడేపల్లిగూడెం స్థానిక జడ్పీ హైస్కూల్, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్ ప్రగతి జూనియర్ కాలేజీ ఎదురుగా యూనియన్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగును.
ఈ వైద్య శిబిరంలో కార్డి యాలజీ.డా” వి.జీవన్ బాబు (గుండె సంబంధిత వైద్య సేవలు), హార్ట్ ఎటాక్, చాతి నొప్పి, కళ్ళు తిరగడం చూడబడును ఆర్డోపెడిక్స్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్.పి.ఎస్.ఎస్.కె. గుణ సూర్య, ఎముకలు, మెదడు సంబంధిత వైద్య సేవలు చూడబడును. సాధారణ వైద్యము డాక్టర్ .సిహెచ్ రేణుక, విష జ్వరాలు, పాము కాటు, జలుబు, దగ్గు, ఆయాసము, పసికర్లు,
పెరాలసిస్ ,థైరాయిడ్ , గ్యాస్ ట్రబుల్, గుండె పెరగడం, బి.పి., షుగర్, వైద్య సేవలు, క్రిటికల్ కేర్ శస్త్ర చికిత్స డాక్టర్ కె.సునీల్, హెర్నియా, పేగు జారుట, 24 గంటలు కడుపు నొప్పి, కణితలు, గాల్ బ్లాడర్ స్టోన్స్, వైద్య సేవలు, గైనకాలజీ డాక్టర్ కార్తిక లక్ష్మి, గర్భము మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ కణుతులు, బహిష్టు, తెల్ల బట్ట, మోనోపాజ్ సమస్యలు, ఈ వైద్య శిబిరము నందు ఉచిత వైద్య సేవలు అందించబడును. వీటితోపాటు లుపిడ్ ప్రొఫైల్ ,బియండి , యూరిక్ యాసిడ్ ,హెచ్ బి ఏ 1సి , ఎఫ్బిఎస్ , పి పి బి ఎస్, ఆర్ బి ఎస్ లాంటి పరీక్షలు డాక్టర్లు సూచనల మేరకు అవసరమైన వారికి కొన్ని రకాల రక్తపరీక్షలు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్యం ఈ శిబిరంలో అందిస్తారు. టూడి , ఇకో ,ఈసీజీ ,షుగర్ టెస్టులు, బీపీ పరీక్షలు 3000వేల విలువగల పరీక్షలు ఆధునిక యంత్రాలతో జరిపి కొన్ని రకాల మందులు ఉచితంగా అందజేస్తారు.ఈ శిబిరంలో దాదాపు1000 మందికి ఉచిత వైద్య సేవలు , పరీక్షలు నిర్వహించి మందులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని , తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ నల్లజర్ల ఉంగుటూరు పెంటపాడు పరిసర ప్రాంత ప్రజలందరూ మరియు జిల్లా ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కోరారు.