Headlines

విద్యార్థులకు కీలకమైన దశ ఇంజనీరింగ్: చైర్మన్ బూరుగుపల్లి గోపాల కృష్ణ

విద్యార్థులకు కీలకమైన దశ ఇంజనీరింగ్: చైర్మన్ బూరుగుపల్లి గోపాల కృష్

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 11:

స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లితండ్రుల కు అవగాహన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఇస్మాయిల్ తల్లితండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలలో జవాబుదారీ నీ పెంచినప్పుడే వారి అభివృధి కి మార్గం సుగమం అవుతుంది అని తెలియచేశారు. చైర్మన్ బూరుగుపల్లి గోపాల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు కీలకమైన దశ ఇంజనీరింగ్ అని, రాబోయే నాలుగు సంవత్సరాలు తల్లితండ్రులు పూర్తి శ్రద్ధ తో పిల్లలను పర్యవేక్షించాలని సూచనలు ఇచ్చారు. వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులలో సమభావ న పెంపొందించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడేలా తీర్చి దిద్దాలని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, డీన్లు ఈ సందర్భంగా వారికి సలహాలు సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో పదివేల ర్యాంకు లోపు వచ్చిన ఏడుగురు విద్యార్థులకు ల్యాప్ టాప్ లను బహూకరించారు.