Headlines

ఏపీలో అల్లర్లు..పోలీసులపైనే సిట్ పేరుతో విచారణ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన గొడవలపై పోలీసులపైనే సిట్ పేరుతో విచారణ జరుగుతోంది. పరిస్థితులను చక్కబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఫిర్యాదులు, ఆరోపణలతో ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. సిట్‌ విచారణతో అటు పొలిటిషియన్స్‌, అటు పోలీసులు సైతం వణికిపోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఏపీలో అల్లర్లు జరిగిన చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లాలపై సిట్ బృందం శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న నరసరావుపేటలో 8 గంటలపాటు అధికారులు కేసులను పరిశీలించారు. ఈరోజు చంద్రగిరి, తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేటలో పర్యటించి వివరాలు సేకరించనున్నారు. పోలింగ్ రోజు ముందు నుంచి నిన్నటి వరకు జరిగిన గొడవలకు సంబంధించిన ప్రతి FIRను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు.. మరో 5 రోజులపాటు దర్యాప్తు చేయనున్నారు.

 

ఇప్పటికే మరి కొందరు పేర్లను చేర్చి దర్యాప్తు చేస్తున్నారు. గొడవల సెక్షన్ కింద నమోదైన సెక్షన్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. నరసారావుపేట మండలం దొండపాడు, మామిడిపాడు గ్రామాల్లో జరిగిన అల్లర్ల వీడియోలను పరిశీలిస్తున్నారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం.. సిట్ అధికారి సౌమ్య లత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అల్లర్ల వీడియోలను పరిశీలించారు.

 

ఎన్నికల రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన ఘర్షణల పై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్‌ బృందం కూచివారిపల్లి గ్రామాన్ని పరిశీలించింది. ముందుగా సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి గృహాన్ని పరిశీలించారు. చంద్రశేఖర్ రెడ్డి ఇంటితోపాటు కార్‌ను కూడా దగ్ధం చేసిన నేపథ్యంలో వాటిని పరిశీలించారు. తర్వాత కూచివారిపల్లిలోని గ్రామస్తులతో సమావేశమయ్యారు. గొడవలు మొదట ఏ విధంగా ప్రారంభమయ్యాయి అన్న విషయాన్ని సిట్ డీఎస్పీ రవి మనోహరాచారి తెలుసుకున్నారు. పూర్తి సమాచారాన్ని సిట్ చైర్మన్‌కు అందజేస్తానని తెలి

పారు.