Headlines

మట్కా గుట్కా గంజాయిల అధినేత సంజీవయ్య..

సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం సంజీవయ్య నిద్రలే ఇంకా నిద్ర పోతున్నావు నీవు అధికారంలో లేవు ఇంకా అధికారంలో ఉన్నాము అన్న బ్రహ్మతో మాట్లాడుతున్నావ్ అధికారులను ఇష్టానుసారంగా మాట్లాడడం తగదు పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో నీవు చేసిన రౌడి ఇజం గూండాయిజం అంతా ఇంతా కాదు మేము ఎరుక కాస్త ఆగు అన్న నిలబల సుబ్రహ్మణ్యం

తిరుపతి జిల్లా

సూళ్లూరుపేట మండలం న్యూస్ 9 ప్రతినిధి సులూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నెలవలు సుబ్రహ్మణ్యం గురువారం సులూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాలూకా ఆఫీసులో తాసిల్దార్ గోపాలకృష్ణ నిర్మించినటువంటి గోడ కేవలం ఎన్నికల ను సక్రమంగా నిర్వహించడం కోసం నిర్మించుకున్నదే తప్ప వేరే దురుద్దేశం లేదు అన్న విషయాన్ని గ్రహించలేని సంజీవయ్య అధికారులను ఇష్ట రాజ్యంగా మాట్లాడడం తగదు అని తెలియజేశారు. నీ పాలనలో సంజీవయ్య గ్రావెల్ ఇసుక మట్టి అక్రమ రవాణా ఎలా జరిగిందో మాకు తెలుసు అంతే అంతే కాదు ఎంపీటీసీ జడ్ పి టీ సి ఎన్నికలలో నీవు చేసిన రౌడీ ఇజం గూండా ఇజం మాకు తెలియదా కనీసం మా పార్టీ వారిని నామినేషన్లు కూడా వేయకుండా చేసావు ఇంకా నీ ఆటలు సాగవు గుర్తుంచుకో అధికారులపై నీ పెత్తనం ఏంటి అని నీ పాలనలో గంజాయి గుట్కాలు ఏరులై పారింది గుర్తుంచుకో అని మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మీరు వాస్తానుసారంగా ఉత్తర దిక్కు నుండి ఎంపీడీవో కార్యాలయానికి దారి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆ ఉత్తర దిక్కు వైపు నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారని అలాంటప్పుడు ఈ మార్గంతో అవసరం లేదని వారు తెలియజేశారు అంతేకాకుండా ఎమ్మార్వో కార్యాలయం నుండి ఎంపీడీవో కార్యాలయముకు వెళ్లడానికి కూడా మార్గం ఉన్నదని ఆ మార్గాన్ని ఎప్పుడో ఏర్పాటు చేశారని దాన్ని ఉపయోగించుకోవచ్చు అని కూడా ఆయన తెలియజేశారు

కార్యక్రమంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మీ రాజ్యంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక కానీ మట్టి కానీ గ్రావెల్ కానీ ఇష్టాను రాజ్యంగా తరలించారని ఇటీవల మీరు అడ్డగోలుగా నిర్వహిస్తున్నటువంటి బియ్యం వ్యాపారానికి గోపాలకృష్ణ తహసిల్దారు అడ్డుపడ్డాడు అన్న దానితో ఆయన మీద అనవసరమైనటువంటి నిందలు మోపడం తగదని ఆయన హితవు పలికారు కార్యక్రమంలో ఆకుతోట రమేష్ మాట్లాడుతూ గోపాలకృష్ణ తాసిల్దార్ వచ్చిన తరువాత సులూరుపేట తాలూకా కార్యాలయాన్ని చక్కగా రూపుదిద్దారని అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత మండలంలో ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా కానీ మట్టి అక్రమ రవాణా గాని గ్రావుల అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేయడం జరిగిందని అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేటువంటి విధానాన్ని ఆయన అడ్డుకున్నారని అంతే కాకుండా సులూరుపేటలో నిర్మాణం చేపడుతున్నటువంటి అక్రమ కాటడాలను కూడా కూల్చివేశారని వీటిని దృష్టిలో ఉంచుకొని మాజీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం తగదని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉందని అదే విధంగా అధికారులు తప్పు చేస్తే కూడా దండించడం కూడా జరుగుతుందని సక్రమంగా ఉన్నటువంటి అధికారులను ప్రోత్సహించడం జరుగుతుందని అంతేకాకుండా సక్రమంగా పనిచేసేటువంటి అధికారికి తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో ఏజీ కిషోర్ తదితరులు హాజరు కావడం జరిగింది