Headlines

Editor

11 పార్టీలే మిగిలాయ్‌.. ఏ గ్రూపులో చేరని ఎంపీలు 91 మంది..

దేశంలో రాజకీయ పునరేకీరణ వేగవంతమైంది. అధికార పక్షాలన్నీ ఎన్డీయేగా, విపక్షాలన్నీ ఇండియా అలియాస్‌ యూపీఏగా జట్టు కట్టాయి. ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ ప్రధానమైనవి. ఈ నాలుగు…

Read More

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పురంధరేశ్వరి తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈనెల 27న విశాఖపట్నంలో ఆమె పర్యటించబోతున్నారు. పదాధికారులతో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఉక్కు సవాల్ ఇటీవల పురంధరేశ్వరి విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఆమె విలేకరులతో పలు విషయాల గురించి చర్చించారు….

Read More

జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు

రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం బిసి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ క్రుష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ…

Read More

. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటాతో పాటు ఏటీ అండ్‌ టీ వంటి కంపెనీలు ఫలితాలు

ఈవారం అమెరికాలోని ప్రధాన టెక్‌ కంపెనీలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటాతో పాటు ఏటీ అండ్‌ టీ వంటి కంపెనీలు ఫలితాలు రానున్నాయి. చాలా మంది అనలిస్టులు ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ గురించి ఈ కంపెనీలు ఏమంటాయోనని ఆసక్తితో ఉన్నారు. ఏఐ ప్రభావం ఈ కంపెనీలపై ఏమాత్రం ఉందో అంచనాకు రావడానికి ఈ ఫలితాలు ఉపకిస్తాయని భావిస్తున్నాయి. మరోవైపు జూకర్‌ బర్గ్‌ థ్రెడ్స్‌ గురించి ఏమంటారు… ముఖ్యంగా డిజిటల్‌ యాడ్స్‌ బాగా తగ్గుతున్నాయని వార్తలు వస్తున్న…

Read More

ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్లు విరిగినట్టు.. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న రిజర్వేషన్ల వివాదం

ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్లు విరిగినట్టు.. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న రిజర్వేషన్ల వివాదం ఏకంగా మతం రంగు పులుముకుంది. అంతే కాదు ఏకంగా విధ్వంసానికి దారి తీసింది. ఇప్పట్లో ఈ మంటలు చల్లారే పరిస్థితి కన్పించడం లేదు. ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింగిచన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తుండగా.. అంతకు మించిన ఘటనలు జరిగాయని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన మే…

Read More

నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుంది ఏపీలో పాలకపక్షం తీరు.వైసీపీ సర్కార్ ఏది చేసిన రాజకీయమే.

నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుంది ఏపీలో పాలకపక్షం తీరు.వైసీపీ సర్కార్ ఏది చేసిన రాజకీయమే. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఎంచుకునేది అక్రమార్గమే. ఇప్పుడు పవన్ విషయంలో చేస్తున్నది కూడా అదే. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వ్యవస్థాగత లోపాలపై, పాలనా వైఫల్యాల పై పోరాడుతుంటే వైసీపీ నేతలు వ్యక్తిగతవిమర్శలకు దిగుతున్నారు. తాజాగా వాలంటీర్లతో కోర్టులో కేసు వేయించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం…

Read More

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్ తగ్గింది. మొన్నటి వరకు బీఆర్ ఎస్ కు పోటీగా పార్టీ ఒక్కసారిగా మూడో ప్లేస్ కు పరమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా మారిపోయింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు….

Read More

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతం

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతంగా రాణించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 3203 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 5007 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 2412 కోట్ల నికర లాభాన్ని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. మార్కెట్‌ అంచనాలకు మించి ఫలితాలను టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇతర…

Read More

దాదాపు రెండున్నర నెలలు దాటింది. ఇంటర్‌నెట్‌ లేదు. పత్రికలు రావడం లేదు

దాదాపు రెండున్నర నెలలు దాటింది. ఇంటర్‌నెట్‌ లేదు. పత్రికలు రావడం లేదు. పోలీస్‌ బూట్ల చప్పుళ్లు, తుపాకీ మోతలు, ఇళ్ల దహనాలు.. ఎప్పుడు ఎవరు చస్తారో తెలియదు. ఎవరు మీదకు దూసుకువస్తారో తెలియదు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉందో తెలియదు కాని.. పచ్చటి మణిపూర్‌ నెత్తుటి ధారగా కన్పిస్తోంది. అక్కడ జరుగుతున్న హింసాకాండ ఒళ్లును జలదరింపజేస్తోంది. నిరసనలో భాగంగా ఓ బాలుడి తలకు బుల్లెట్‌ తగిలింది. అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఓ…

Read More

దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరే వేరు

దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరే వేరు. ఈ విషయం చాలా సందర్భాల్లో తేలింది. మూడు రాజధానుల నిర్ణయం వెలువడినప్పుడే మిగతా రాష్ట్రాలకు ఏపీ భిన్నమని సంకేతాలు ఇచ్చారు. ఈ అంశం ఇబ్బందికరమైనా మొండిగా ముందుకు పోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇండియా పటంలో నిలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్,పోలవరం వంటి విషయాల్లో కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబెట్టలేకపోయారు. విభజన హామీలు సాధించలేక చతికిల పడ్డారు. ఇప్పుడు జలజీవన్…

Read More