Headlines

తాళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన భక్తులు..

కొత్తపేట.. కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం లో వేంచేసియున్న గ్రామ దేవత తాళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి ఉగాది పర్వదినాన భక్తులు పోటెత్తారు.ఉగాది సంద్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యు లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు బడులు తీర్చుకున్నారు.నిన్న రాత్రి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది.గరగ నృత్యాలు,బాణాసంచా కాల్పులు భక్తులను ఆకట్టుకున్నాయి.ప్రతీ ఉగాది రోజున మధ్యాహ్నం అమ్మవారి తీర్థ మహోత్సవాలు జరుగుతాయి.ఈ తీర్థ మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు.

Read More

ఆలమూరు మండల గౌడ సంఘం ప్రముఖ నేత అనేo వెంకన్నకు ఉగాది పురస్కారంగా నంది అవార్డు రావడం చాలా హర్షినియం! ఆలమూరు మండల శెట్టిబలిజ ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు!..

బీసీ నాయకులలో ఆలమూరు మండలంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఆనెo వెంకన్న (కొబ్బరికాయలు మాజీ వ్యాపారస్తులు వెంకన్న) వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేయుచున్నాము. రేపు రాబోతున్న ఉగాది సందర్భంగా ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తో అడ్వాన్స్ గా శుభాకాంక్షలు! బీసీ శెట్టిబలిజ మండల సంఘం నుంచి తెలియజేయుచున్నాము. ఒక గొప్ప పురస్కారం అందుకున్న మంచి మనసున్న వ్యక్తిగా, పదిమందికి ఆత్మీయుడుగా, అందరి కససుఖాల్లోనూ, నేనున్నానని స్నేహభావంతో ముందుకు సాగుతూ, అందరినీ ఆప్యాయతతో పలకరించే గొప్ప…

Read More

పలివెల లాకు షట్టర్లు అమరిక మరియు మరమ్మత్తులు అనంతరం ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి..

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వద్ద అమలాపురం ప్రధాన కాలువకు పూర్తి అయిన పలివెల లాకు రెండు షట్టర్లు వియర్ యొక్క షట్టర్లు అమరిక మరియు మరమ్మత్తుల పనులను పరిశీలించి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. అలాగే రెండు షట్టర్లకు పనులు జరగవలసిన పనులను ప్రారంభించారు.   ఈ సందర్భంగా శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గోదావరి నదికి పైనుండి రావాల్సిన నీరు సరిగా రాకపోవడం వలన ఏర్పడిన…

Read More

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు 78 మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన బోథ్ శాసన సభ్యులు శ్రీ రాథోడ్ బాపూ రావు,…

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు 78 మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన బోథ్ శాసన సభ్యులు శ్రీ రాథోడ్ బాపూ రావు, *తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి*, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంది పొచ్చు బాయి, MRO వనజ రెడ్డి, MPDO రమాకాంత్, ఉప సర్పంచ్ నర్సింహులు, BRS పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, mptc వెంకన్న యాదవ్, BRS మండల కన్వీనర్ వెంకటేష్,…

Read More

భక్తుల పాలిట అమృత వర్షిని నూకాంబిక అమ్మవారు..రేపు చింతలూరు జాతర….

భక్తుల పాలిట అమృత వర్షిని నూకాంబిక అమ్మవారు. రేపు చింతలూరు జాతర. పవిత్ర గోదావరి నది తీరాన పచ్చని పకృతి నడుమ భక్తులు పాలిట అమృత వర్షినిగా సమస్త మానవాళికి చింతలు తీర్చే తల్లిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాలమ్మ జాతర మహోత్సవం మార్చి 20వ తేది నుండి ప్రారంభం కానుంది. శ్రీ అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాలు చరిత్ర ఉంది. ఆ గ్రామానికి దక్షిణ దిశగా ఉండే పాలచెట్టు తొర్రలో…

Read More

దుద్దెడ గ్రామంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై తలమైన వెంకటలక్ష్మికి చెందిన మూడు దూడలు మృతి…

దుద్దెడ గ్రామంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై తలమైన వెంకటలక్ష్మికి చెందిన మూడు దూడలు మృతి చెందాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామము వేములగట్టుకు చెందిన ఈమె దుద్ధెడ గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని పశువులను పోషిస్తూ పాడి రైతుగా జీవనోపాధి పొందుతున్నారు. వెంకటలక్ష్మి భర్త ఇటీవల మృతి చెందాడు .ఇద్దరు కూతుర్లతో పాడి రైతుగా జీవనోపాధి పొందుతున్న వెంకటలక్ష్మికి దూడల మృతితో తీవ్ర నష్టం వాటిల్లింది. పాలిచ్చే మూడు గేదలు రేపటినుండి ఇవ్వడం మానేస్తాయని ఆందోళనలో…

Read More

ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కొత్తపేట డీఎస్పీ కె.వి. రమణ..

కొత్తపేట మండల కేంద్రంలోని కొత్తపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు సిద్దార్థ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను కొత్తపేట డీఎస్పీ కె.వి.రమణ పరిశీలించారు.విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారనేది అబ్జర్వ్ చేశారు. పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక పోలీసులకు, కళాశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

కొత్తపేట : వేగంగా దూసుకు వచ్చిన కారు బీభత్సం సృష్టించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపేట మండలం ఏనుగు మహల్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. రావులపాలెం నుంచి అమలాపురం వెళుతున్న మారుతి రిడ్జ్ కారు వేగంగా వచ్చి ఒక ఆటోను రెండు బైకులను ఢీ కొట్టి చికెన్ షాపులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో పాటు ఆటో, రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని…

Read More

పీపుల్స్ మార్ట్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు..

మన్యం న్యూస్, పినపాక, మార్చి 15 పినపాక నియోజకవర్గం నుంచి గురువారం రోజున అదిలాబాద్ జిల్లాలో జరగనున్న పీపుల్స్ మార్ట్ పాదయాత్రకు సంఘీభావంగా బుధవారం నియోజకవర్గ  సుమారు 100 మంది కార్యకర్తలతో వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం తెలియజేశారు. ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పిసిసి సభ్యులు చక్రవర్తి, చందా సంతోష్ పినపాక మండల అధ్యక్షులు రామనాథం లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక…

Read More

హెచ్చుమీరుతున్న వైసిపి ఆగడాలు.అధికారం మాటున రెచ్చిపోతున్న మట్టి మాఫియా..ప్రశ్నించిన వారి ఇళ్లపై దాడులు

రావులపాలెం, కొమరాజులంక // అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయని ఇళ్లపై దాడులకు దిగుతున్నారని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.   అధికారం అడ్డుపెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ధన దాహంతో కొట్టుమిట్టాలాడుతున్నారు. వారిని ప్రశ్నించినా, లేదా అడ్డు తగిలినా ఇంటి మీదకు వచ్చి దాడులకు దిగుతున్నారని దళిత సోదరులను పావులుగా చేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో ప్రశాంతతను భంగం కలిగిస్తున్నారని…

Read More