Headlines

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు.
Bengaluru Rains | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో బెంగళూరు సహా సలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి భారీగా వరద నీరు చేరింది.

 

మల్లేశ్వర, కేఆర్‌సర్కిల్‌లో వడగళ్ల కురిశాయి. ఈదురు గాలులకు కేఆర్‌సర్కిల్‌, సర్‌ ఎం విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఆనంద్‌రావు సర్కిల్‌ వీవీ దాస్‌ హోటల్‌ ఎదుట చెట్లు నేలకూలాయి. హోటల్‌ వద్ద చెట్టు నేలకూలడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే, ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్‌పై చెట్లకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. కేఆర్‌సర్కిల్‌ వద్ద వర్షపు నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.