Headlines

యూట్యూబ్ వీడియోలకు లైక్‍లు కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్..!

ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. అయినా ఆమె పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంది. ఇదే ఆమె కొంపముంచింది. యూట్యూబ్ వీడియో లైక్ చేసి ఏకంగా రూ.19 లక్షలు పోగొట్టుకుంది.

చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.

అయితే ఆమె ఫోన్ కు ఒక రోజు ఒక మేసేజ్ వచ్చింది. సందేశంలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ వేలల్లో డబ్బులు పొందవచ్చని ఉంది. పూర్తి సమాచారం కోసం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఓ ఫోన్‌ నెంబరును ఇచ్చారు. ఆమె ఆ నెంబరుకు ఫోన్‌ చేశారు. అవతలి వారు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే చాలని, అన్నింటికి లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.

లైకే కాదా కొట్టేస్తే పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చని భావించింది. కండిషన్లకు అంగీకరించి, తన బ్యాంకు ఖాతా వివరాలను ఆన్ లైన్ లో వారికి పంపించింది. ఆమె మూడు వీడియోలు లైక్‌ చేసింది. దీంతో వెంటనే ఆమె బ్యాంక్ అకౌంట్ లో రూ.150 క్రెడిట్ చేశారు. మరోసటి రోజు మరో ఆరు వీడియోలను లైక్‌ చేయగా.. రూ. 300 పంపారు. ఇంకేముంది పార్ట్ జాబ్ తో వేలల్లో వస్తున్నాయని ఆనందించింది.

ఇలా నమ్మం కుదిరిన తర్వాత పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మబాలికారు. ఇదంతా నమ్మిన ఆమె తొలుత రూ.1000 చెల్లిస్తేం రూ.1,600 ఆమె ఖాతాలో జమ చేశారు. దీంతో ఆమె మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇలా విడతలవారీగా ఏకంగా రూ.19 లక్షలు మోసగాళ్లకు బదిలీ చేసింది. ఆమెకు ఆన్ లైన్ లాభం వచ్చినట్లు కనిపించిన విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. దీంతో ఆమె వారికి ఫోన్ చేయగా.. మరో రూ.12. 95 చెల్లిస్తే ఆ డబ్బులు డ్రా చేసుకోవచ్చిని చెప్పారు. చివరికి మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.