Headlines

IITల్లో తరుముకు వస్తున్న సంక్షోభం

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technoligy IIT), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(Indian Institute of Management IIM) విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యను అభ్యసించడం చాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక కల. దశాబ్దాలుగా భారతీయ విద్యా సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకువచ్చిన విద్యా సంస్థలవి. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. Scarcity of quality teachers: నాణ్యమైన టీచర్ల కొరత ప్రస్తుతం ఈ విద్యా సంస్థలకు(IITs, IIMs) నాణ్యమైన ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది.

క్వాలిటీ టీచర్లు లేకపోవడంతో ఈ విద్యా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప ఇన్ స్టిట్యూషన్స్ తో, ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ వంటి యూనివర్సిటీలతో పోటీ పడలేకపోతున్నాయి. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల సరసన నిలబడాలంటే ముందుగా అవసరమైంది ప్రపంచ స్థాయి మేథో సంపత్తి కలిగిన ప్రొఫెసర్లే. ప్రస్తుతం మన ఐఐటీలు, ఐఐఎంలను ఈ కొరతే దారుణంగా వేధిస్తోంది. ప్రస్తుతం ఐఐటీల్లో(IITs) 4500 టీచింగ్ పోస్ట్ లు, ఐఐఎం(IIMs)లలో 500 టీచింగ్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. ఐఐఎం(IIMs)లలో సాంక్షన్డ్ పోస్ట్ ల సంఖ్య 1500. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో(Central universities) 6000 వేల టీచింగ్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా ఐఐటీ కాలేజీల సంఖ్యను పెంచుతున్నారు.

కానీ వాటిలో నాణ్యమైన ఫాకల్టీ లభించే అవకాశం ఉందా? అనే విషయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరోవైపు, చాలా మంది తెలివైన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే, కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఆకర్షణీయమైన ప్యాకేజీల కారణంగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉన్నత విద్యకు, పరిశోధన విద్యకు వారు ఆసక్తి చూపడం లేదు. ఆ మార్గం ఎన్నుకుంటే జీవితంలో సెటిల్ కావడానికి చాలా సమయం పడుతుందనే కారణం వల్ల కూడా చాలా మంది విద్యార్థులు ఆ దిశగా ఆలోచించడం లేదు. Thousands of PhDs: వేల సంఖ్యలో పీహెచ్ డీలు భారత్ లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీల నుంచి ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో డాక్టరేట్లు(PhDs) చేసిన వారు బయటకు వస్తున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం, ఏటా 25 వేల మంది పీహెచ్ డీ పూర్తి చేస్తున్నారు. అయితే, వారిలో ఐఐటీలు, ఐఐఎంలలో(IITs, IIMs) బోధన చేసేంత మేథో సామర్ద్యం మాత్రం ఉండడం లేదు. వారు డాక్టరేట్ సర్టిఫికెట్ ను సాధిస్తున్నారే కానీ, సంబంధిత సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదించడం లేదు. చివరకు, ఐఐటీలు, ఐఐఎం(IITs, IIMs)ల లో పీహెచ్ డీలు చేసిన వారిలోనూ ఈ సామర్ధ్యం కొరవడడం గమనార్హం. ఈ కారణంగా, ఒక్క ఐఐటీలు, ఐఐఎంలకే(IITs, IIMs) కాదు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు కూడా సమర్ధులైన టీచర్లు లభించడం లేదు. నాణ్యమైన టీచర్ల కొరత అనే సంక్షోభం భవిష్యత్ తరాలకు, భవిష్యత్ భారతానికి గొడ్డలిపెట్టు వంటిదని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.