Headlines

స్త్రీ శక్తి ఎంతో ఘనం.మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు —ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

 

రావులపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని నామినేటెడ్ పోస్టులలో 50 శాతం మహిళలకు కల్పించాలని నిర్ణయించారు అని, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెంలో సర్పంచ్ తాడేపల్లి నాగమణి మరియు ఎంపీటీసీ సభ్యులు, ఇతర మహిళలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దుశ్శాలువాలు మరియు పూలమాలలతో సత్కరించారు.

మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని రూపొందించారని, వై.యస్.ఆర్.ఆసరా, వై.యస్.ఆర్.చేయూత, అమ్మఒడి, జగనన్న చేదోడు తదితర పథకాల ద్వారా మహిళల అభ్యున్నతి కోసం ఆర్ధిక చేయూత అందించడం జరుగుతుంది అని చిర్ల జగ్గిరెడ్డి తెలియచేశారు.

 

ఈ కార్యక్రమంలో మహిళలు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.