Headlines

ప్రభుత్వ కార్యకలాపాలను గ్రామస్థాయిలో ప్రజల వద్దకే తీసుకుని వెళ్లేందుకు గాను ప్రభుత్వ ప్రాధాన్యత

కొత్తపేట ఏప్రిల్ 21: ప్రభుత్వ కార్యకలాపాలను గ్రామస్థాయిలో ప్రజల వద్దకే తీసుకుని వెళ్లేందుకు గాను ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వరిత గతిన అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలో వాడపాలెం గ్రామంలో గ్రామ సచివాలయ భవనo, రైతు భరోసా కేంద్రాన్ని మరియు జగనన్న పాలవెల్లువ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ను ఆయన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపె ట్టిందని ఆ యొక్క కార్యకలాపాల నిర్వహణకు ఈ భవనాలను అందు బాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసనసభ్యు లు మరియు ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం రంగాలతోపాటు సుపరిపాలన ను క్షేత్రస్థాయిలో అందించే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం ముక్కం టి, డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్, పశుసంవర్ధక శాఖ జేడి డాక్టరే జైపాల్, పంచాయితీరాజ్ ఎస్ ఇ కే చంటిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి కె నాగేశ్వర రావు, ఎంపీపీ మార్గాని గంగాధర్, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట జడ్పిటిసి జి రమాదేవి, తాసిల్దార్ జెడి కిషోర్ బాబు, ఎంపీడీవో రాజేష్ తదితరులు పాల్గొన్నారు.